కమల్ ఎమోషనల్ పోస్ట్..తనకిదే అసలైన గిఫ్ట్ అంటూ!

Published on Nov 7, 2021 11:02 am IST

ఈరోజు మన ఇండియన్ సినిమా దగ్గర ఉన్నటువంటి పలువురు సినీ ప్రముఖుల పుట్టినరోజు.. వారిలో విశ్వ నటుడు కమల్ హాసన్ పుట్టినరోజు కూడా ఈరోజే. అయితే కమల్ హీరోగా నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ “విక్రమ్” నుంచి నిన్ననే ఓ గిఫ్ట్ గా అదిరే టీజర్ గ్లింప్స్ ని చిత్ర యూనిట్ రిలీజ్ చెయ్యగా దానికి భారీ రెస్పాన్స్ వస్తుంది.

అలాగే ఇంకో పక్క పలువురు సినీ ప్రముఖులు అభిమానులు కూడా కమల్ కు విషెష్ చెబుతుండగా కమల్ మాత్రం వారి నుంచి మరొకటి కోరుకుంటున్నారు. ఇవేవి కాదు ప్రతి ఒక్కరూ ఇప్పుడు వరదలతో బాధ పడుతున్నవారికి పేద ప్రజలకు సహాయం అందించండి అని ఇదే నా బర్త్ డే ఇచ్చే అసలైన గిఫ్ట్ అంటూ కమల్ హాసన్ ఎమోషనల్ పోస్ట్ ని పెట్టి తెలియజేసారు. దీనితో కమల్ పై ప్రతి ఒక్కరికీ మరింత గౌరవం పెరిగింది.

సంబంధిత సమాచారం :

More