
ఉత్తమ విలన్ సినిమాను చెక్కిన తరువాత కమల్ హసన్ తన తదుపరి సినిమా ప్రకటన కాస్త వినూత్నంగా వీడియో రూపంలో విడుదలచేసాడు. ఈ వీడియోలో తదుపరి తాను నటించనున్న ద్విభాషా చిత్ర వివరాలు తెలుపడం విశేషం.
ఈ ప్రాజెక్ట్ ఈ నెల 24న హైదరాబాద్ లో మొదలై మొదటి షెడ్యూల్ 40రోజులపాటూ కొనసాగనుంది. మిగిలిన టాకీ పార్ట్ ని చెన్నైలో పుర్తిచేయనున్నారు. ‘తూంగవనం’ అనే టైటిల్ తో, ‘నిద్రపోని ఒక అడవి’ అని అర్ధంవచ్చే ట్యాగ్ లైన్ తో ఈ సినిమా మనముందుకురానుంది. థ్రిల్లర్ రూపంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చాలా ఆసక్తికరమైన అంశాలు వున్నాయి.
కమల్ సొంత సంస్థ రాజ్ కమల్ ఫిలిమ్స్ బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కుతుంది. కమల్ స్నేహితుడు రాజేష్ దర్శకుడు. ఘిబ్రన్ సంగీతాన్ని అందించనున్నాడు. మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడిస్తారు.

