“కల్కి” ను ప్రారంభించడానికి అప్పుడు చాలా ఆసక్తిగా ఉన్నా – కమల్ హాసన్

“కల్కి” ను ప్రారంభించడానికి అప్పుడు చాలా ఆసక్తిగా ఉన్నా – కమల్ హాసన్

Published on Jun 19, 2024 10:26 PM IST

పాన్ వరల్డ్ మూవీ కల్కి 2898AD జూన్ 27, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లోకి రానుంది. ఈ చిత్రంలో రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించగా, యూనివర్సల్ స్టార్ హీరో కమల్ హాసన్, బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, స్టార్ హీరోయిన్స్ దీపికా పదుకునే, దిశా పటాని లు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రం రిలీజ్ కి దగ్గర పడుతుండటంతో మేకర్స్ ప్రమోషన్స్ ను వేగవంతం చేయడం జరిగింది. అందులో భాగంగానే ముంబై లో నేడు ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించడం జరిగింది.

ఈ ఈవెంట్ లో కమల్ హాసన్ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. కల్కి చిత్రం స్టార్ట్ అయ్యే ముందు ఎంతో ఆసక్తిగా ఉన్నా, అప్పుడు నేను చాలా ఆశ్చర్య పోయాను. ఇప్పుడు విస్మయంలో ఉన్నా అని అన్నారు. కమల్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ చిత్రంలో కమల్ హాసన్ సుప్రీం యాస్కిన్ పాత్రలో కనిపించనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు