విక్రమ్ తో కమల్ ఫుల్ ఫామ్ లోకి!

Published on Jun 21, 2022 11:30 pm IST

యూనివర్సల్ స్టార్ హీరో కమల్ హాసన్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ విక్రమ్ తమిళనాట సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. లోకేష్ కనగరాజు దర్శకత్వం లో తెరకెక్కిన ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా భారీ వసూళ్ళను రాబడుతోంది. పలు చిత్రాలతో కమల్ హాసన్ బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచినప్పటికి, విక్రమ్ భారీ బ్లాక్ బస్టర్ తో ఫుల్ ఫామ్ లో ఉన్నారు. ఇదే తరహా లో వరుస సినిమాలు చేస్తున్నారు కమల్.

ఈ చిత్రం లో కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటించగా, ఫాహద్ ఫజిల్, విజయ్ సేతుపతి, సూర్య లు కీలక పాత్రల్లో నటించారు. అనిరుద్ రవి చందర్ సంగీతం అందించిన ఈ చిత్రం సీక్వెల్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం :