బిగ్ బాస్ అల్టిమేట్ నుండి హోస్ట్ గా వైదొలగిన కమల్ హాసన్

బిగ్ బాస్ అల్టిమేట్ నుండి హోస్ట్ గా వైదొలగిన కమల్ హాసన్

Published on Feb 21, 2022 12:17 AM IST

బుల్లితెర ప్రేక్షకులను విశేషం గా ఆకట్టుకుంటున్న రియాలిటీ షో బిగ్ బాస్. ఇండియా లో అన్ని భాషల్లో ఈ షో కి విపరీతమైన క్రేజ్ ఉంది. తెలుగు లో మాత్రమే కాకుండా, తమిళ్ లో కూడా ఈ షో ఎంతగానో పాపులర్ అయింది. ఈ షో కి ఇప్పటి వరకు కమల్ హాసన్ వ్యాఖ్యాత గా వ్యవహరిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. బిగ్ బాస్ అల్టిమేట్ పేరిట వస్తున్న ఈ షో కు కమల్ హాసన్ హోస్ట్ గా ఉండటం వలన షో కి మరింత క్రేజ్ ఉందన్న విషయం వాస్తవం అని చెప్పాలి.

తాజాగా ఈ షో నుండి హోస్ట్ గా వైదొలుగుతున్నట్లు కమల్ హాసన్ ప్రకటించడం జరిగింది. ప్రస్తుతం అతను ప్రధాన పాత్రలో నటిస్తున్న విక్రమ్ సినిమా కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఒక లెటర్ ద్వారా వెల్లడించడం జరిగింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు