డబ్బింగ్ మొదలుపెట్టిన కమల్ హాసన్ !

విలక్షణ నటుడు కమల్ హాసన్ ప్రస్తుతం ‘విశ్వరూపం-2’ సినిమాను పూర్తిచేసే పనిలో ఉన్నారు. కొన్నేళ్లుగా నిలిచిపోయిన ఈ ప్రాజెక్టును అసలు నిర్మాత ఆస్కార్ రవిచంద్రన్ నుండి పూర్తిగా తన చేతుల్లోకి తీసుకున్న కమల్ అన్ని జాగ్రత్తలు తీసుకుని చివరి దశకు చేర్చారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది.

కమల్ హాసన్ కూడా తన పాత్ర తల్లూకు డబ్బింగ్ ను ప్రారంభించినట్లు తెలుస్తోంది. 2013లో వచ్చిన ‘విశ్వరూపం’ చిత్రానికి సీక్వెల్ గా ఈ సినిమా రూపొందుతోంది. ఇందులో పూజా కుమార్, ఆండ్రియా, రాహుల్ బోస్, శేఖర్ కపూర్ వంటివారు నటిస్తున్నారు. తమిళ, హిందీ భాషల్లో ఒకేసారి రూపొందుతున్న ఈ సినిమాను తెలుగులోకి డబ్ చేయనున్నారు. కమల్ నటించడమేగాక నిర్మిస్తూ, డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను ఈ ఏడాది మొదటి సగం లోపు రిలీజ్ చేసే అవకాశాలున్నాయి.