ప్రభాస్ ని వెంటాడుతున్న కమల్ ఆర్ ఖాన్.

Published on May 25, 2019 9:47 am IST

బాలీవుడ్ లో అత్యంత వివాదాస్పద నటుడిగా కమల్ ఆర్ ఖాన్ కి గొప్ప పేరే వుంది. ఇండస్ట్రీ ప్రముఖుల మీదా, చిత్రాలపైన అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఎప్పడూ వార్తలలో ఉంటాడు ఈ నటుడు. ఒక తరుణంలో ఇతని చర్యలు శృతిమించి పోవడంతో, తన సోషల్ మీడియా అకౌంట్స్ బ్యాన్ చేశారు. ఇండియా మొత్తం బాహుబలి మేనియా తో ఊగిపోతున్న తరుణం లో , “బాహుబలి” చిన్న పిల్లలు చూసే కార్టూన్ మూవీ వలె ఉందని , తీవ్రవిమర్శలు చేసాడు.

తాజాగా మరోసారి ప్రభాస్ మూవీ పై తీవ్ర విమర్శలు చేసాడు కమల్ ఆర్ ఖాన్. తాజాగా సుజిత్ దర్శకత్వంలో అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న “సాహో” మూవీ ఖచ్చితంగా అట్టర్ ప్లాప్ అవుతుందని అన్నారు. “సాహో” సినిమా టి-సిరీస్ చరిత్ర లోనే ఒక పెద్ద డిజాస్టర్ అవుతుంది, ఎందుకంటే దాని బడ్జెట్ 250 కోట్లు” అంటూ తన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేశాడు.ఈమధ్య బాలీవుడ్ ఇండస్ట్రీ లో సౌత్ మూవీస్ ఆధిపత్యాన్ని జీర్ణించుకోలేకే కమల్ లాంటి వ్యక్తులు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More