కమల్ మరో సీక్వెల్ కు ఓకే చెప్పాడు !

Published on Oct 13, 2018 3:34 pm IST


లోకనాయకుడు కమల్ హాసన్ ప్రస్తుతం సీక్వెల్ చిత్రాలఫై పడ్డాడు. ఇటీవల ‘విశ్వరూపం’ సినిమాకు సీక్వెల్ గా విశ్వరూపం 2′ తెరకెక్కించిన ఆయన ఈ చిత్రం తరువాత ప్రముఖ దర్శకుడు శంకర్ తెరకెక్కించనున్న ‘భారతీయుడు’2లో నటించనున్నాడని తెలిసిందే. ఈచిత్రం గతంలో కమల్ -శంకర్ కలయికలో వచ్చిన సూపర్ హిట్ మూవీ ‘భారతీయుడు’ చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కనుంది. ఇక ఈచిత్రం ఇంకా సెట్స్ మీదకు రాకముందే కమల్ మరో సీక్వెల్ ను సిద్ధం చేస్తున్నాడు.

1992లో భరతన్ దర్శకత్వంలో కమల్ నటించిన చిత్రం ‘తేవర్ మగన్’ శివాజీ గణేశన్ , రేవతి, గౌతమి ముఖ్య పాత్రల్లో నటించిన ఈచిత్రం మంచి విజయం సాధించింది. ఈచిత్రాన్ని తెలుగులో ‘క్షత్రియ పుత్రుడు’ పేరుతో అనువదించారు. ఇక ఇన్ని సంవత్సరాల తరువాత మళ్లీ ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ గా ‘తేవర్ మగన్ 2’ ను తెరకెక్కించాలనుకుంటున్నాడట కమల్.

ఈ విషయాన్ని నిన్న జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో స్వయంగా ఆయనే వెల్లడించారు. భారతీయుడు 2 చిత్రాన్ని పూర్తి చేసిన తరువాత ఈ చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకెళుతారట.

సంబంధిత సమాచారం :