కమల్ హాసన్ కి గౌరవ డాక్టరేట్

Published on Nov 19, 2019 10:30 pm IST

లోకనాయకుడు కమల్ హాసన్ కి ఈ ఏడాది చాలా ప్రత్యేకం. ఆయన రెండు పండుగలు ఇటీవల జరుపుకున్నారు. ఒకటి ఆయన 65వ పుట్టినరోజు కాగా, రెండవది ఆయన నటప్రస్థానం మొదలై 60ఏళ్ళు కావడం. రెండురోజుల క్రితం కోలీవుడ్ ప్రముఖుల సమక్షంలో ఈకార్యక్రమాన్ని గ్రాండ్ గా సెలెబ్రేట్ చేశారు. కాగా నేడు ఒడిస్సా ప్రభుత్వం కమల్ హాసన్ ని గౌరవ డాక్టరేట్ తో సత్కరించారు. సెంచూరియన్ యూనివర్సిటీ కమల్ కి ఈ డాక్టరేట్ ప్రధానం చేయగా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కమల్ కి బహూకరించారు.

దీనిపై కమల్ హాసన్ హర్షం వ్యక్తం చేయడంతో పాటు, ఒరిస్సా ప్రభుత్వానికి కృతఙ్ఞతలు తెలిపారు. కాగా ప్రస్తుతం కమల్ నటిస్తున్న భారతీయుడు చిత్రం షూటింగ్ జరుపుకుంటుంది. శంకర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తుండగా కాజల్, రకుల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. హీరో సిద్దార్ధ్ ఓ కీలక రోల్ చేస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ లో మూవీ విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :

More