వరుణ్ తేజ్ ‘కంచె’ ఫస్ట్ డే టోటల్ కలెక్షన్ రిపోర్ట్

వరుణ్ తేజ్ ‘కంచె’ ఫస్ట్ డే టోటల్ కలెక్షన్ రిపోర్ట్

Published on Oct 23, 2015 7:36 PM IST

Kanche
తెలుగు ప్రేక్షకులెవ్వరూ ఊహించని కథాంశం మరియు బ్యాక్ డ్రాప్ తో డైరెక్టర్ క్రిష్ తెరకెక్కించిన సినిమా ‘కంచె’. ఒక ప్రేమకథకి అలానాటి కుల వ్యవస్థని సమస్యగా సృష్టించి దానికి వరల్డ్ వార్ II నేపధ్యాన్ని కల్పించి చేసిన ఈ సినిమాకి విమర్శకుల నుంచి మంచి ప్రశంశలు దక్కాయి. అలాగే ప్రేక్షకుల నుంచి కూడా ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తోంది. అలాగే చూసిన ప్రతి ఒక్కరూ క్రిష్ వర్క్ ని మెచ్చుకుంటున్నారు. ఈ సినిమాలో క్రిష్ చూపించిన వార్ ఎపిసోడ్స్ హాలీవుడ్ సినిమాలను తలపిస్తుండడం సినిమాకి చాలా పెద్ద ప్లస్ అయ్యింది. చిన్నగా రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి రోజు డీసెంట్ కలెక్షన్స్ ని సాధించింది. ఏరియాల ప్రకారం కంచె కలెక్ట్ చేసిన షేర్ వివరాలు మీ కోసం..

ఏరియా కలెక్షన్స్(షేర్)
నైజాం 63 లక్షలు
సీడెడ్ 33.6 లక్షలు
నెల్లూరు 7.2 లక్షలు
గుంటూరు 24.5 లక్షలు
కృష్ణా 21 లక్షలు
పశ్చిమ గోదావరి 17 లక్షలు
తూర్పు గోదావరి 22 లక్షలు
ఉత్తరాంధ్ర 21.7 లక్షలు
తెలంగాణ, ఏపి మొత్తం షేర్ 2.10 కోట్లు

సంబంధిత సమాచారం

తాజా వార్తలు