‘ముకుంద’ లాంటి డిఫరెంట్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన యంగ్ మెగా హీరో వరుణ్ తేజ్ తన రెండవ సినిమా కోసం టాలీవుడ్లో విభిన్న చిత్రాలు చేసిన క్రేజీ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో చేసిన సినిమా ‘కంచె’. క్రిష్ ఈ సారి వరల్డ్ వార్ II బ్యాక్ డ్రాప్ ని మెయిన్ గా చేసుకొని అందులో ఓ సున్నితమైన ప్రేమకథని జోడించి దానిని కంచె’గా మన ముందుకు తీసుకురానున్నాడు. ఇప్పటి వరకూ తెలుగు తెరపై రాని పాయింట్ ని బేస్ చేసుకొని సరికొత్త కథాశంతో తెరకెక్కిన ఈ సినిమాపై తెలుగు సినీ అభిమానుల్లో అంచనాలు బాగానే ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్స్ మరియు పోస్టర్స్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది.
ఇదిలా ఉంటే వరల్డ్ వార్ II బ్యాక్ డ్రాప్ కథ కదా బాగా ఎక్కువ టైం చెప్తారేమో అనుకుంటే పొరబాటే.. ఈ చిత్ర టీం తెలిపిన సమాచారం ప్రకారం కంచె రన్ టైం కేవలం 2 గంటల 5 నిమిషాలు మాత్రమే. అలాగే సినిమాలో ఎక్కడా అనవసరమైన సీన్స్ ని పెట్టకుండా సినిమా మొదటి నుంచి చివరి వరకూ ఒకటే ఫీలింగ్ తో, సూపర్ ఫాస్ట్ స్క్రీన్ ప్లే తో మన ముందుకు తీసుకురానున్నారు. ఈ షార్ట్ రన్ టైం మరియు ఫాస్ట్ స్క్రీన్ ప్లే సినిమా చూస్తున్నంత సేపు ఆడియన్స్ ని కంటెంట్ కి హుక్ చేస్తుందని ఇప్పటికే ఈ సినిమా చూసిన వారు అంటున్నారు. వరుణ్ తేజ్ సరసన ప్రాగ్య జైస్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 22న రిలీజ్ కానుంది. బాలీవుడ్ యాక్టర్ నికేతన్ దీర్ విలన్ గా కనిపించనున్న ఈ సినిమాకి రాజీవ్ రెడ్డి – సాయి బాబులు నిర్మాతలు.


