హాలీవుడ్ రేంజ్ వార్ ఎపిసోడ్స్ తో రానున్న ‘కంచె’

హాలీవుడ్ రేంజ్ వార్ ఎపిసోడ్స్ తో రానున్న ‘కంచె’

Published on Oct 19, 2015 1:15 PM IST

kanche
బాహుబలి, రుద్రమదేవి లాంటి ఎపిక్ స్టోరీస్ తర్వాత తెలుగు చలన చిత్ర సీమ నుంచి వస్తున్న వరల్డ్ వార్ II ఎపిక్ ఫిల్మ్ ‘కంచె’. గమ్యం, వేదం, కృష్ణం వందేజగద్గురుమ్ లాంటి డిఫరెంట్ సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన క్రిష్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో యంగ్ మెగా హీరో వరుణ్ తేజ్ హీరోగా నటించాడు. 1940 బ్యాక్ డ్రాప్ లో నడిచే ఈ ప్రేమకథకి వరల్డ్ వార్ II ఎపిసోడ్ ని మిక్స్ చేసి చెప్పడం ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. క్రిష్ వరల్డ్ వార్ సీన్స్ ని సింపుల్ గా లాగించేయకుండా బాగా ఖర్చు చేసి లావిష్ గా తీసారు.

మాకు అందిన సమాచారం ప్రకారం క్రిష్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో ఈ వరల్డ్ వార్ ఎపిసోడ్ ని షూట్ చేసాడట. జార్జియాలోని హాలీవుడ్ టెక్నీషియన్స్ తో గ్రౌండ్ వర్క్ చేసి, అప్పటి వరల్డ్ వార్ ని తలపించేలా, అప్పటి రియల్ వెపన్స్ ని కూడా వాడి చోస్త్ చేసాడని సమాచారం. అందుకే కంచెలో వరల్డ్ వార్ బ్యాక్ డ్రాప్ సీన్స్ అన్నీ మనకు ఓ హాలీవుడ్ సినిమా చూస్తున్నామనే ఫీలింగ్ ని కలిగిస్తుందని అంటున్నారు. అలాగే ఇందులో ఉండే ప్రేమకథ కూడా మనసుకు హత్తుకునేలా ఉంటుందని సమాచారం. వరుణ్ తేజ్ సరసన ప్రాగ్య జైశ్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి చిరంతన్ భట్ మ్యూజిక్ అందించాడు. పుల్ స్వింగ్ లో ప్రమోషన్స్ జరుగుతున్న ఈ సినిమా అక్టోబర్ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు