బాహుబలి, రుద్రమదేవి లాంటి ఎపిక్ స్టోరీస్ తర్వాత తెలుగు చలన చిత్ర సీమ నుంచి వస్తున్న వరల్డ్ వార్ II ఎపిక్ ఫిల్మ్ ‘కంచె’. గమ్యం, వేదం, కృష్ణం వందేజగద్గురుమ్ లాంటి డిఫరెంట్ సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన క్రిష్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో యంగ్ మెగా హీరో వరుణ్ తేజ్ హీరోగా నటించాడు. 1940 బ్యాక్ డ్రాప్ లో నడిచే ఈ ప్రేమకథకి వరల్డ్ వార్ II ఎపిసోడ్ ని మిక్స్ చేసి చెప్పడం అందరినీ ఆకర్షిస్తోంది. ఫుల్ పాజిటివ్ టాక్ ఉన్న ఈ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సినిమాపై ఉన్న క్రేజ్ ని మరింత పెంచడం కోసం ఈ చిత్ర టీం లేటెస్ట్ గా రెండు ట్రైలర్స్ ని రిలీజ్ చేసింది. అందులో ఒకరి ట్రైలర్, రెండవది డైలాగ్ ట్రైలర్.. ఈ రెండు ట్రైలర్స్ కి అందరి నుంచి సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. వరల్డ్ వార్ II విజువల్స్ మరియు డైలాగ్స్ ఈ సినిమాకి స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తాయని అంటున్నారు. వరుణ్ తేజ్ సరసన ప్రాగ్య జైశ్వాల్ హీరోయిన్ గా కనిపించనుంది. బాలీవుడ్ యాక్టర్ నికేతన్ దీర్ విలన్ గా కనిపించనున్న ఈ సినిమాకి రాజీవ్ రెడ్డి – సాయి బాబులు నిర్మాతలు.
కంచె న్యూ ట్రైలర్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి


