
తెలుగు సినీ అభిమాని దృష్టిని గత కొద్దికాలంగా పూర్తిగా తనవైపు మళ్ళించుకున్న క్రేజీ సినిమా ‘కంచె’ ప్రపంచవ్యాప్తంగా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ‘గమ్యం’, ‘వేదం’, ‘కృష్ణం వందే జగద్గురుమ్’ లాంటి సినిమాలతో తెలుగులో తనదైన ముద్ర వేసుకున్న దర్శకుడు క్రిష్ తన కంచె సినిమానూ తనదైన బ్రాండ్‌తో రెండో ప్రపంచయుద్ధ నేపథ్యానికి ఓ ప్రేమకథను జోడించి క్రిష్ తెరకెక్కించారు. వరుణ్ తేజ్, ప్రగ్యా జైస్వాల్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా దసరా కానుకగా విడుదలైన మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటుంది.
ఇండియన్ స్క్రీన్‌పై ఇప్పటివరకూ రానటువంటి నేపథ్యమున్న కథతో వచ్చిన కంచె, తెలుగు సినిమాలో ఓ ప్రత్యేక సినిమాగా గుర్తింపు తెచ్చుకుంది. విడుదలైన అన్నిచోట్ల నుంచీ ఈ సినిమాకు పాజిటివ్ రిపోర్ట్స్ వస్తున్నాయి. క్రిష్ మార్క్ టేకింగ్, వరుణ్ తేజ్ నటన ఈ సినిమాకు మేజర్ హైలైట్స్‌గా నిలిచాయి. ఇక క్రిష్ సినిమాకు మంచి ఫాలోవర్స్ అయిన క్లాస్ ఆడియన్స్ ఈ సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అమెరికాలో ప్రీమియర్ షోస్ ప్లస్ మొదటి రోజు కలుపుకొని 99,808 డాలర్లు వసూలు చేసింది. రెండవ రోజు కూడా స్టడీ కలెక్షన్స్ సాధించింది. కంచె లాంటి సినిమాకు ఈ కలెక్షన్స్ ఓ రకంగా ఉత్సాహాన్నిచ్చే విషయంగా చెప్పుకోవచ్చు.

