షాక్ ఇస్తున్న కంగనా పారితోషికం !

Published on Oct 27, 2018 11:48 am IST

బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ పారితోషికం ఇప్పుడు ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ అవుతుంది. ప్రస్తుతం కంగనా, వీరనారి ఝాన్సీలక్ష్మీ భాయ్ జీవిత చరిత్ర ఆదరంగా తెరకెక్కుతున్న ‘మణికర్ణిక’ అనే చిత్రంలో ప్రధాన పాత్రలో నటిస్తుంది.

ఇక ఈ చిత్రంలో నటిస్తున్నందుకు ఆమె ఏకంగా 14కోట్ల పారితోషికాన్ని తీసుకుందట. భారతీయ సినీ చరిత్రలో ఇప్పటివరకు ఏ హీరోయిన్ ఈ రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకోలేదు. ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ కథ, స్క్రీన్ ప్లే ను అందిస్తున్న ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్ నిర్మిస్తుంది. ప్రస్తుతం నిర్మాంతర కార్యాక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 25న విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :