కంగనా పక్కన సూట్ అవుతాడా ?

Published on Oct 18, 2019 3:00 am IST

దివంగత ముఖ్యమంత్రి జయలలితగారి జీవితం ఆధారంగా, బాహుబలి రైటర్ విజయేంద్ర ప్రసాద్ రాసిన కథతో తమిళ దర్శకుడు ఏ ఎల్ విజయ్ ‘తలైవి’ అనే టైటిల్ తో అమ్మ బయోపిక్ ను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ బయోపిక్ లో జయలలిత పాత్రలో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ నటిస్తోంది. కాగా ఈ చిత్రంలో ఎం.జి.ఆర్ పాత్ర‌లో ప్ర‌ముఖ న‌టుడు అరవింద స్వామి న‌టిస్తున్నారు. అయితే కంగనా లాంటి హాట్ బ్యూటీ పక్కన అరవింద స్వామి లాంటి సాఫ్ట్ యాక్టర్ సూట్ అవుతాడా ? చూడాలి. ఇక ఈ చిత్రం రెగ్యుల‌ర్ షూటింగ్ న‌వంబ‌ర్ నుండి ప్రారంభం కానుంది. కంగనా రనౌత్ ను అచ్చం అమ్మలా మార్చెందుకు హాలీవుడ్ మూవీ ‘డార్కెస్ట్ హవర్’కి మేకప్ మెన్ గా పనిచేసిన ‘గ్యారీ ఓల్డ్ మెన్, ‘అమ్మ’ బయోపిక్ కూడా చేస్తున్నారు.

జయలలిత జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలతో పాటు ఆమె చివరి రోజులను కూడా ఈ సినిమాలో చూపించనున్నారు. దాంతో కంగనా 16 ఏళ్ల వయసు పాత్ర నుండి నుండి 60 ఏళ్ల వయసు గల పాత్ర వరకూ ఈ సినిమాలో కనిపించనుంది. ఈ క్రమంలో కంగనా మొత్తం నాలుగు గెటప్స్ లో కనిపించనుంది. కాగా ఇప్పటికే ఈ సినిమా కోసం తమిళం కూడా నేర్చుకుంటున్న ఈ బాలీవుడ్ క్వీన్.. ఇప్పుడు బరువు కూడా పెరుగుతుందని.. ఈ సినిమా కోసం దాదాపు పది కిలోలు వరకూ కంగనా బరువు పెరగుతుందట. ఇక తెలుగు కన్నడ మలయాళ పరిశ్రమల్లో కూడా ఈ సినిమా పై మంచి అంచనాలే ఉన్నాయి. కాబట్టి వంద కోట్లుపెట్టినా ఈజీగా రికవరీ అవుతాయని చిత్రబృందం భావిస్తోంది.

సంబంధిత సమాచారం :

X
More