కంగనాను ఆ విషయం చాలా ఇబ్బంది పెట్టేస్తుందట.

Published on Nov 15, 2019 8:39 am IST

ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా ‘తలైవి’ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. దీనికి ఏఎల్‌ విజయ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో హిందీ నటి కంగనా రనౌత్‌.. జయలలిత పాత్ర పోషిస్తోంది. ఇటీవల ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమైంది. అంతకుముందు దాదాపు నాలుగు నెలల పాటు నిర్మాణ పూర్వ పనులకే పెద్దపీట వేసింది చిత్ర బృందం. ఈ సినిమా కోసం ఆమె కొంత బరువు పెరిగినట్లు సమాచారం. జయలలిత యాస, హావభావాలను నేర్చుకున్నారట కంగనా.

ఇక భాష గురించి ఈ అమ్మడు మాట్లాడుతూ ‘తమిళం నేర్చుకోవడం చాలా శ్రమతో కూడిన విషయం. కష్టంగా ఉంది. అయినా నేర్చుకుంటున్నా. చాలా డైలాగులను కంటస్తం చేస్తున్నా. డైలాగులే ఈ చిత్రానికి మరింత కీలకం కానున్నాయి. గతంలోనే తమిళం నేర్చుకోవాలని ఆశ పడ్ఢా కానీ కుదరలేదు. ఇప్పుడు గట్టి ప్రయత్నం చేస్తున్నా. ఎందుకంటే ఈ సినిమాకు తమిళం చాలా ముఖ్యం. ఈ చిత్రం దక్షిణాది భాషలతో పాటు హిందీలోనూ విడుదలవుతోందని’ పేర్కొన్నారు.

సంబంధిత సమాచారం :

X
More