కరోనా నుండి ప్రాణాలతో బయటపడ్డ లేడీ సింగర్

కరోనా నుండి ప్రాణాలతో బయటపడ్డ లేడీ సింగర్

Published on Apr 5, 2020 3:37 PM IST

బాలీవుడ్ సింగర్ కనికా కపూర్ కోవిడ్ పాజిటివ్ గా తేలిన సంగతి తెలిసిందే. కొద్దిరోజుల క్రితం లండన్ నుండి వచ్చిన ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ అని వచ్చింది. దీనితో ఆమెను లక్నో నందు గల సంజయ్ గాంధీ ఇన్స్టిట్యూట్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుండి ఉంచి వైద్యం అందిస్తున్నారు. చాల రోజులుగా చికిత్స పొందుతున్న కనికా కపూర్ కి నాలుగు సార్లు టెస్ట్స్ నిర్వహించినా పాజిటివ్ అని వచ్చింది.

కాగా తాజాగా నిర్వహించిన వైద్య పరీక్షలలో ఆమె కోవిడ్ 19 నెగెటివ్ అని వచ్చిందని సమాచారం. ఈ మేరకు వైద్యులు పాత్రికేయులకు తెలియపరచడం జరిగింది. ఐతే మరో మారు టెస్ట్స్ నిర్వహించిన తరువాత ఆమెను డిశ్చార్జ్ చేస్తామని చెప్పడం విశేషం. బాలీవుడ్ నుండి కరోనా వైరస్ బారిన పడిన మొదటి సెలెబ్రెటీగా కనికా పేరు మారుమోగిపోయింది. అలాగే ఆమె నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తూ కొందరు నెటిజెన్స్ ఆమెపై విమర్శలు కూడా చేశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు