అల్లు అర్జున్ సరసన కన్నడ హీరోయిన్ !
Published on Apr 4, 2017 11:23 am IST


ప్రస్తుతం హరీష్ శంకర్ డైరెక్షన్లో ‘దువ్వాడ జగన్నాథం’ సినిమాలో నటిస్తున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఆ సినిమా పూర్తయ్యాక వెంటనే రచయిత వక్కంతం వంశీ డైరెక్షన్లో ఒక సినిమాని మొదలుపెడతాడట. ఈ సినిమాకి ‘నా పేరు సూర్య’ అనే టైటిల్ ను కన్ఫర్మ్ చేశారట. అయితే తాజాగా ఈ ప్రాజెక్ట్ గురించి మరో ఆసక్తికరమైన వార్త ఒకటి ఫిల్మ్ నగర్లో చక్కర్లుకొడుతోంది. అదేమిటంటే ఈ సినిమాలో బన్నీ సరసన కన్నడ హీరోయిన్ ను తీసుకోనున్నారట.

ఆ నటి మరెవరో కాదు 2016 డిసెంబర్లో విడుదలైన కన్నడ చిత్రం ‘కిరిక్ పార్టీ’ లో హీరోయిన్ గా చేసిన రష్మిక. ఈ చిత్రం ఆమెకు మొదటిదే అయినా కూడా అందులో ఆమె నటనకు గాను మంచి ప్రసంశలు దక్కాయి. అందుకే ఆమెనే హీరోయిన్ గా తీసుకోవాలనే ఆలోచన చేసిన వంశీ తాజాగా హైదరాబాద్లో ఆమెపై టెస్ట్ షూట్ కూడా నిర్వహించారట. అందులో ఆమె పెర్ఫార్మెన్స్ చూసి బన్నీ అండ్ కో బాగా ఇంప్రెస్ అయ్యారని, దాదాపు ఆమెనే ఖాయం చేసేశారని తెలుస్తోంది. కానీ ఈ విషయంపై అధికారిక ప్రకటన విడుదలయ్యే వరకు కాస్త వేచి చూడాల్సిందే.

 
Like us on Facebook