ప్రభాస్‌కు ఘన స్వాగతం పలికిన పవర్ స్టార్

Published on Dec 2, 2020 8:30 pm IST

ప్రభాస్ సినిమా సినిమాకు తన పరిధిని పెంచుకుంటూ వెళ్తున్నారు. ‘బాహుబలి’ తర్వాత చేస్తున్న సినిమాలన్నీ పాన్ ఇండియా స్థాయిలో ఉండేలా చూసుకుంటున్నారు. ఇప్పటికే ‘సాహో’ చిత్రంతో హిందీ పరిశ్రమలో ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకున్న ఆయన ఇతర భాషల పరిశ్రమలోకి కూడ అడుగుపెడుతున్నారు. తాజాగా కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ హీరోగా ప్రభాస్ కొత్త చిత్రం ‘సలార్’ ప్రకటన జరిగింది.

దీన్ని తెలుగుతో పాటు కన్నడ, హిందీ భాషల్లో కూడ తెరకెక్కించనున్నారు. అంటే ఈ సినిమాతో ప్రభాస్ అధికారికంగా కన్నడ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతున్నారు. సాధారణంగా తెలుగు హీరోలు కన్నడలో నేరుగా సినిమాలు చేయడం అరుదు. ఇప్పుడు ప్రభాస్ అదే చేయబోతున్నారు. అందుకే కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ‘చేతులు చాచి మా కన్నడ మీకు స్వాగతం పలుకుతోంది. ఐ వెల్కమ్ యు హోమ్’ అంటూ ప్రభాస్‌కు కన్నడ పరిశ్రమలోకి సాదర స్వాగతం పలికారు. కన్నడ సినీ ప్రేక్షకులు సైతం ప్రభాస్‌ను తమ ఇండస్ట్రీలోకి ఆహ్వానిస్తున్నారు. ఒక పాన్ ఇండియా హీరోగా ప్రభాస్‌ కెరీర్లో ఇదొక కీలకమైన అడుగనే చెప్పాలి.

సంబంధిత సమాచారం :

More