మరో యువ నటుడు ఆత్మ హత్య.

Published on Jul 9, 2020 1:02 am IST


2020 లో చలన చిత్ర పరిశ్రమలకు చెందిన అనేక మంది నటులు ప్రాణాలు కోల్పోయారు. బాలీవుడ్ లో సుశాంత్ సింగ్ ఆత్మ హత్య మరవక ముందే మరో నటుడు ఆత్మ హత్య చేసుకున్నారు. కన్నడ బుల్లితెర నటుడిగా మంచి పేరున్న సుశీల్‌ గౌడ నిన్న ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన సుశీల్‌ స్వస్థలం మండ్యలో మంగళవారం చోటుచేసుకుంది. అయితే సుశీల్‌ ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. 30 ఏళ్ల వయసున్న సుశాంత్‌ ఆత్మహత్యకు పాల్పడటం అతని స్నేహితుల్లో, శాండల్‌వుడ్‌లో, టీవీ పరిశ్రమలో విషాదాన్ని నింపింది. అంతఃపుర అనే రొమాంటిక్‌ సీరియల్‌లో నటించిన సుశీల్‌ మంచి గుర్తింపు పొందారు. నటుడిగానే కాకుండా ఆయన ఫిట్‌నెస్‌ ట్రైనర్‌గా కూడా ఉన్నారు.

అలాగే కన్నడ చిత్రాల్లో నటించేందుకు సుశీల్‌ ప్రయత్నాలు చేస్తుండేవారు. హీరో దునియా విజయ్‌ నటిస్తున్న తాజా చిత్రంలో సుశీల్‌ పోలీసు పాత్రలో నటించారు. అయితే ఆ చిత్రం విడుదలకు ముందే ఆత్మహత్యకు పాల్పడి అందరినీ షాక్‌కు గురిచేశారు. కొద్దిరోజుల క్రితం కన్నడ హీరో చిరంజీవి సర్జా గుండె పోటుతో అకాల మరణం చెందారు. ఆ విషాదం మరవక ముందే ఈ సంఘటన చోటు చేసుకుంది.

సంబంధిత సమాచారం :

More