“కాంతార చాప్టర్ 1” డిజిటల్ పార్ట్ నర్ ఫిక్స్!

“కాంతార చాప్టర్ 1” డిజిటల్ పార్ట్ నర్ ఫిక్స్!

Published on Mar 19, 2024 7:30 PM IST

Kantara

కన్నడ నటుడు రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న పీరియడ్ యాక్షన్ థ్రిల్లర్ కాంతార(Kantara) చాప్టర్ 1, ది లెజెండ్ ఉప శీర్షిక. 2022 లో వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ అయిన కాంతార చిత్రానికి ప్రీక్వెల్ గా తెరకెక్కుతోంది. ఈ చిత్రం కి సంబందించిన ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా, ఆడియెన్స్ నుండి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం మరోసారి వార్తల్లో నిలిచింది.

ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫారం అయిన అమేజాన్ ప్రైమ్ వీడియో, ఈ చిత్రం యొక్క డిజిటల్ రైట్స్ ను సొంతం చేసుకుంది. ఇదే విషయాన్ని ప్రైమ్ వీడియో సోషల్ మీడియాలో అధికారికంగా వెల్లడించడం జరిగింది. థియేట్రికల్ రిలీజ్ అనంతరం, ప్రైమ్ వీడియో లో సినిమా ప్రసారం కానుంది. హొంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు