అక్కడ కేజీఎఫ్ ను బీట్ చేయనున్న “కాంతార”

అక్కడ కేజీఎఫ్ ను బీట్ చేయనున్న “కాంతార”

Published on Oct 30, 2022 9:35 PM IST


కన్నడ సెన్సేషన్ కాంతార చిత్రం ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది. ఈ సినిమా మూడో వారంలో కూడా విడుదలైన కొత్త సినిమాలన్నింటికీ గట్టి పోటీనిస్తోంది. ఈ ఇంటెన్స్ విలేజ్ డ్రామాకి రిపీట్ ఆడియన్స్ కూడా ఉన్నారు. ప్ర‌స్తుతం ఈ చిత్రం హిందీ వ‌ర్ష‌న్ వ‌సూళ్లు 38 కోట్ల రూపాయలు అని వార్త‌లు వ‌చ్చాయి.

కాంతార చిత్రం కేజీఎఫ్ పార్ట్1 లైఫ్‌టైమ్ కలెక్షన్‌ లను దాదాపు 44 కోట్ల రూపాయలతో బీట్ చేయడానికి ట్రాక్‌లో ఉంది. నిన్న ఒక్కరోజే ఈ సినిమా 4 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టి రామ్ సేతు, థాంక్స్ గాడ్ కలెక్షన్లకు పోటీ ఇస్తోంది. అంతగా స్టార్ పవర్ లేని సినిమాకు ఇది చాలా గొప్ప విజయం. ఈ చిత్రంలో సప్తమి గౌడ కథానాయికగా నటించగా, అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందించారు. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై విజయ్ కిరంగదూర్ కాంతారను నిర్మించారు. ఈ చిత్రం లాంగ్ రన్ లో భారీ వసూళ్లు రాబట్టే అవకాశం ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు