కరణ్ జోహార్ మనోవేదన వర్ణానాతీతం..!

Published on Jul 9, 2020 4:00 pm IST

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మ హత్య సోషల్ మీడియాలో ఓ ఉద్యమానికి తెరలేపింది. ఆయనను బాలీవుడ్ పెద్దలు మానసిక వేదనకు గురిచేసి, ఆత్మహత్య చేసుకొనేలా ప్రేరేపించారని ఆయన అభిమానులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా కరణ్ జోహార్, అలియా భట్, సల్మాన్ ఖాన్ మరియి కరీనా కపూర్ వంటి తారలను టార్గెట్ చేస్తూ సుశాంత్ అభిమానులు, నెటిజెన్స్ తీవ్రవిమర్శలు చేయడం జరిగింది. నెటిజెన్స్ వ్యాఖ్యలు సదరు సెలెబ్రిటీలను బాగా బాధపెట్టాయని తెలుస్తుంది.

ముఖ్యంగా కరణ్ జోహార్ నెటిజెన్స్ విమర్శలకు కృంగిపోయారని తెలుస్తుంది. సుశాంత్ మరణానికి కారకుడిగా తనని నిందిస్తున్న వారి వ్యాఖ్యలు కరణ్ చేత కంట తడి పెట్టించాయట. కరణ్ లాయర్ ప్రస్తుతం సుశాంత్ మరణం గురించి మాట్లాడకపోతేనే మంచిది అని చెప్పారట. దానితో పాటు కరణ్ ప్రస్తుతం ఏమి మాట్లాడే స్థితిలో లేరని,ఆయన స్పందించ లేదని, ఆయన సన్నిహితులు తెలియజేశారు.

సంబంధిత సమాచారం :

More