ఆ స్టార్ హీరోకు మగ బిడ్డ పుట్టాడు

Published on Oct 21, 2020 2:05 am IST


తమిళ స్టార్ హీరో కార్తీ సతీమంణి రంజనీ గర్భవతి అనే సంగతి తెలిసిందే. కొద్దిసేపటి క్రితమే ఆమెకు ప్రసవం అయింది. మగ బిడ్డ జన్మించినట్టు కార్తీ తెలిపారు. తమకు మగబిడ్డ పుట్టినట్టు చెప్పిన కార్తీ జీవితాన్ని మార్చిన ఈ శుభ పరిణామంలో మా గురించి కేర్ తీసుకున్న వైద్యులకు, నర్సులకు కేవలం కృతజ్ఞతలు చెప్పి సరిపెట్టలేను. మా బిడ్డకు మీ అందరి ఆశీస్సులు కావాలి అంటూ తన సంతోషాన్ని పంచుకున్నారు.

కార్తీ సోదరుడు, హీరో సూర్య సైతం తన తమ్ముడికి మగబిడ్డ పుట్టినందుకు ఆనందం వ్యక్తం చేస్తూ వైద్యులకు థ్యాంక్స్ చెప్పారు. కార్తీ రెండోసారి తండ్రి అయిన సంగతి తెలిసి అభిమానులు, సినీ ప్రముఖులు ఆయనకు అభినందనలు తెలియజేస్తున్నారు. కార్తీ, రంజనీలు 2011లో వివాహం చేసుకోగా వారికి 2013లో ఆడబిడ్డ జన్మించిన సంగతి తెలిసిందే. ఇకపోతే కార్తీ తాజాగా తన కొత్త చిత్రం ‘సుల్తాన్’ షూటింగ్ ముగించి త్వరలో మొదలుకానున్న మణిరత్నం ‘పొన్నియన్ సెల్వన్’ షూటింగ్ కోసం సిద్దమవుతున్నారు.

సంబంధిత సమాచారం :

More