సెన్సార్ కంప్లీట్ చేసుకున్న కార్తీ “జపాన్”

సెన్సార్ కంప్లీట్ చేసుకున్న కార్తీ “జపాన్”

Published on Nov 2, 2023 3:00 PM IST

Japan 1

కోలీవుడ్ టాలెంటెడ్ హీరో కార్తీ హీరోగా అను ఇమ్మానుయేల్ హీరోయిన్ గా దర్శకుడు రాజు మురుగన్ కాంబినేషన్ లో తెరకెక్కించిన ఇంట్రెస్టింగ్ చిత్రం “జపాన్”. మరి కార్తీ కంప్లీట్ గా ఒక సరికొత్త మేకోవర్ అండ్ బాడీ లాంగ్వేజ్ లో చేసిన ఈ చిత్రంపై మంచి బజ్ నెలకొనగా ఈ చిత్రం నుంచి రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ కూడా హిట్ అయ్యింది. దీనితో మళ్ళీ కార్తీ మంచి హిట్ అందుకునేలా ఉన్నాడని అంతా అనుకుంటున్నారు.

ఇక ఈ చిత్రం ఇపుడు సెన్సార్ ని అయితే కంప్లీట్ చేసుకుంది. మరి ఈ చిత్రం యూ/ఏ సర్టిఫికెట్ ని సొంతం చేసుకుంది. దీనితో అన్ని పనులు కంప్లీట్ చేసుకొని అయితే ఈ చిత్రం తెలుగు మరియు తమిళ్ లో ఈ నవంబర్ 10న గ్రాండ్ గా దీపావళి కానుకగా రిలీజ్ కాబోతుంది. ఇక ఈ చిత్రానికి జివి ప్రకాష్ సంగీతం అందిస్తుండగా డ్రీమ్ వారియర్ పిక్చర్స్ వారు నిర్మాణం వహించారు.

తాజా వార్తలు