పెట్టా లీక్డ్ వీడియో చూసి షాక్ అయ్యాడట !

పెట్టా లీక్డ్ వీడియో చూసి షాక్ అయ్యాడట !

Published on Oct 8, 2018 2:08 PM IST

karthik subbaraj
సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న 165వ చిత్రం ‘పెట్టా’ లీకుల బారిన పడిన విషయం తెలిసిందే. ఈచిత్రంలోని కొన్ని ముఖ్యమైన స్టిల్స్ అలాగే వీడియో లీకుల రూపంలో బయటికి వచ్చాయి. తాజాగా ఈలీకులపై చిత్ర దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ ట్విట్టర్ ద్వారా స్పందించారు.

ఒక టీవీ చానెల్ లో లీక్డ్ వీడియో చూసి షాక్ అయ్యాను. తమిళ న్యూస్ చానెల్ తంతి టీవీ ఈ వీడియో ను ప్రసారం చేసింది. ఇది ఇలాగే కొనసాగితే ముందు ముందు పైరేటెడ్ మూవీస్ ను కూడా వార్తలుగా ప్రసారం చేసి చూపిస్తారు. ఇది వృత్తి ధర్మం కాదని ఆయన అన్నారు. అలాగే షూటింగ్ స్పాట్ స్టిల్స్ , వీడియో లు దయచేసి షేర్ చేయకండని చిత్ర యూనిట్ ను రిక్వెస్ట్ చేస్తూ మీ అందరి సపోర్ట్ కావాలని కార్తీక్ ట్వీట్ చేశారు.

తాజా వార్తలు