2018 చివరి కల్లా పూర్తికానున్న రజనీ కొత్త సినిమా !
Published on Feb 24, 2018 11:44 am IST

సూపర్ స్టార్ రజనీకాంత్ తన తర్వాతి సినిమాను యువ దర్శకుడు కార్తిక్ సుబ్బరాజ్ తో చేయనున్న సంగతి తెలిసిందే. ఈ వార్త అధికారికంగా ప్రకటితం కాగానే అందరిలోనూ ఈ యువ దర్శకుడు రజనీ స్టార్ డమ్ ను ఎలా హ్యాండిల్ చేస్తాడో చూడాలని, అసలతను రజనీ కోసం ఎలాంటి కథ రాశాడో తెలుసుకోవాలనే ఆసక్తి మొదలైంది.

తమిళ సినీ వర్గాల సమాచారం మేరకు కార్తిక్ సుబ్బరాజ్ రజనీని పాత స్టైల్లో చూపించేలా కథ రాశారని, ఇది మేకింగ్ కన్నా కథ మీదే ఆధారపడి నడిచే ప్రాజెక్ట్ అని, ఇంకో రెండు నెలల్లో సినిమా మొదలవుతుందని, 2018 చివరికి పూర్తవుతుందని తెలుస్తోంది. మరి ఇంతలా పాజిటివ్ క్రేజ్ సంపాదించుకున్న వీరి కలయిక ఎలాంటి ఔట్ ఫుట్ ఇస్తుందో తెలియాలంటే ఇంకొన్నాళ్ళు ఆగాల్సిందే. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు.

 
Like us on Facebook