“కార్తీక దీపం2” సీరియల్ కి అద్దిరిపోయిన రెస్పాన్స్!

“కార్తీక దీపం2” సీరియల్ కి అద్దిరిపోయిన రెస్పాన్స్!

Published on Apr 4, 2024 1:17 PM IST


బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ప్రముఖ సీరియల్ కార్తీక దీపం. ఈ సీరియల్ అప్పుడే అయిపోయింది అని అనుకున్న వారికి గుడ్ న్యూస్ చెబుతూ, ప్రముఖ టీవీ ఛానల్ స్టార్ మా కార్తీక దీపం 2 ను స్టార్ట్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ సీరియల్ కి బుల్లితెర ప్రేక్షకుల నుండి అద్దిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ సీరియల్ మొదటి వారం స్టార్ మా లో ప్రసారం కాగా, సూపర్ టీఆర్పీ రేటింగ్ ను సొంతం చేసుకుంది.

ఈ సీరియల్ మొదటి వారం కు గానూ 10.40 టీఆర్పీ రేటింగ్ ను రాబట్టడం జరిగింది. ఇది సూపర్ రెస్పాన్స్ అని చెప్పాలి. ప్రేమి వినీత్ భట్ దీప పాత్రలో నటించగా, నిరుపమ్ పరిటాల డాక్టర్ కార్తిక్ పాత్రలో నటించారు. ఈ సీరియల్ మున్ముందు మరింత క్రేజ్ ను సొంతం చేసుకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు