లేటెస్ట్ : యుఎస్ఏ లో ‘కార్తికేయ – 2’ మూవీ 50 డేస్ సెలబ్రేషన్స్

Published on Sep 30, 2022 9:00 pm IST

నిఖిల్ సిద్దార్థ హీరోగా చందూ మొండేటి దర్శకత్వంలో అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలపై తెరకెక్కిన లేటెస్ట్ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ మూవీ కార్తికేయ 2. మొదటి నుండి అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ రిలీజ్ అయిన తొలి రోజు నుండే సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుని అన్ని భాషల్లో కూడా పెద్ద విజయాన్ని భారీ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. కాల భైరవ మ్యూజిక్ అందించిన ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది.

మన భారతీయ సంస్కృతిని, సనాతన ధర్మాన్ని తెలిపుపుతూ శ్రీకృష్ణ పరమాత్ముని జీవితానికి సంబందించిన ఒక ముఖ్య అంశాన్ని తీసుకుని తెరకెక్కిన ఈ మూవీలో హీరో నిఖిల్ సూపర్ పెర్ఫార్మన్స్ కనబరచగా మూవీని అన్ని వర్గాల ఆడియన్స్ ని అలరించేలా యాక్షన్ థ్రిల్లింగ్ విజువల్ వండర్ గా తెరకెక్కించారు దర్శకుడు చందూ. ఇక కార్తికేయ 2 మూవీ అటు యుఎస్ఏ లో సైతం భారీగా వసూళ్లు అందుకోగా నిన్నటితో ఈ మూవీ సక్సెస్ఫుల్ గా 50 రోజులు కంప్లీట్ చేసుకోవడంతో అక్కడి డిస్ట్రిబ్యూటర్లు గ్రాండ్ గా ఫంక్షన్ చేసారు. నిర్మాత టైజి విశ్వప్రసాద్ పాల్గొన్న ఈ ఫంక్షన్ లో తమ సినిమాని ఇంతలా ఆదరిస్తున్న ఆడియన్స్ కి ప్రతి ఒక్కరూ ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పారు. ఇంకా తమ సినిమా 25 లొకేషన్స్ లో మంచి కలెక్షన్స్ తో కొనసాగుతుండడం ఆనందంగా ఉందని అన్నారు.

సంబంధిత సమాచారం :