ఎర్ర చొక్కా, తెల్ల పంచె దొరబాబులా వచ్చాడుగా…!

Published on Jul 30, 2019 9:55 am IST

యంగ్ హీరో కార్తికేయ తన మూడవ చిత్రంగా నటించిన “గుణ 369” వచ్చే వారం విడుదల కానుంది.దర్శకుడు అర్జున్ జంధ్యాల లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నాడు. కాగా నిన్న ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ని హైదరాబాద్ లోని సైబర్ కన్వెన్షన్ హాల్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా ప్రముఖ గాయకులు బాలు,దర్శకుడు బోయపాటి శ్రీను హాజరయ్యారు.

ఐతే ఈ కార్యక్రమంలో హీరో కార్తికేయ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఎర్ర చొక్కా,తెల్ల పంచే, వేళ్ళకు ఉంగరాలు, మేడలో పెద్ద లాకెట్ ఉన్న గోల్డ్ చైన్, చేతికి వాచ్ తో 90ల నాటి పక్కా పల్లెటూరి దొరబాబులా రెడీ అయ్యి వచ్చాడు. గత చిత్రం ‘హిప్పీ’ ప్రమోషన్ కార్యక్రమాలలో అల్ట్రా మోడరన్ గెట్ అప్స్ లో బోల్డ్ గా ప్రవర్తించిన కార్తికేయ,ఈ సారి ప్రచారం కొరకు సంప్రదాయ పద్ధతులు ఎంచుకుంటున్నాడు కారణమేంటో.

ఈ సందర్భంగా మాట్లాడుతూ విజయాలు ప్లాన్ చేసి కొట్టలేం, వాటికవే జరుగుతాయి, ‘గుణ 369’ మూవీ అలాంటిదే అన్నారు. ఈ మూవీ ద్వారా నచ్చని వాళ్లకు కూడా నచ్చేస్తా అన్నారు. కార్తికేయ సరసన అనఘా నటిస్తుండగా, సాయి కుమార్, ఆదిత్య మీనన్,మంజు భార్గవి,జబర్దస్త్ మహేష్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. తిరుమలరెడ్డి,అనిల్ కడియాల నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. ఆగస్టు 2న గ్రాండ్ గా విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :