ఇంకొక్క ఛాన్స్ ఇవ్వమంటున్న కార్తికేయ

Published on Mar 29, 2021 6:27 pm IST

యంగ్ హీరో కార్తికేయ ఇటీవలే ‘చావు కబురు చల్లగా’ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించాడు. సినిమా మీద చాలా ఆశలే పెట్టుకున్నాడు ఆయన. కానీ చిత్రం ఆశించిన స్థాయిలో ఆడలేదు. మొదటి రోజే నెగటివ్ టాక్ తెచ్చుకుంది. టీజర్, పాటలు, ట్రైలర్ చూసి కార్తికేయ ఏదో కొత్తగా చేస్తాడని అనుకున్న ప్రేక్షకులు కూడ నిరాశ చెందారు. దీంతో సినిమా పరాజయం చెందింది. కేవలం కార్తికేయ నటనకు మాత్రమే మంచి మార్కులు పడ్డాయి. నష్టాలతోనే సినిమా రన్ ముగిసింది.

కార్తికేయ సైతం సినిమా పరాజయాన్ని ఒప్పుకున్నారు. అలాగే ఇంకొక ఛాన్స్ ఇవ్వమని ప్రేక్షకుల్ని కోరుతున్నారు ఆయన. ‘చావు కబురు చల్లగా చిత్రం నటుడిగా నన్ను ఆవిష్కరించింది. చాలా మంది హృదయాలకు దగ్గరయ్యాను. బస్తీ బాలరాజు పాత్రకు వచ్చిన రెస్పాన్స్‌ చూసి గర్వపడ్డాను. సినిమా నచ్చనివారు చిన్న తప్పులున్నా క్షమించేసి మరో చాన్స్‌ ఇవ్వండి. నా తప్పులను సరిదిద్దుకుని బౌన్స్‌ బ్యాక్‌ అవుతాను’ అన్నారు.

సంబంధిత సమాచారం :