నిఖిల్, స్వాతి హీరో హీరోయిన్ లుగా, చందు మొండేటి దర్శకత్వంలో వస్తున్న ‘కార్తికేయ’ సినిమా ఆడియో మరియు ట్రైలర్ లని మంగళవారం ఆవిష్కరించారు. ఈ ట్రైలర్ కి ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన వస్తుంది. “కొన్ని అబద్దాలు ఆలోచించకుండా నమ్ముతాం, కొన్ని నిజాలు నమ్మడానికి ఆలోచిస్తాం”, ట్రైలర్ లోని ఈ డైలాగ్ కి మంచి స్పందన వస్తుంది. ఈ ట్రైలర్ లో నిఖిల్ చాలా స్టైలిష్ గా మరియు స్వాతి ఎప్పటిలాగానే బాబ్లీగా ఉంది.
ఈ సినిమా పాటలు కూడా బాగున్నాయి, ‘కార్తికేయ’తో నిఖిల్ కు మంచి హిట్ వస్తుందని ఆశిద్దాం.


