గుణ కాంబినేషన్ లో మరో యాక్షన్ ఎంటర్ టైనర్ !

Published on Aug 5, 2019 9:40 am IST

అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో కార్తికేయ హీరోగా, మ‌ల‌యాళ భామ‌ అన‌ఘ హీరోయిన్ గా తెర‌కెక్కిన చిత్రం ‘గుణ 369’ శుక్రవారం విడుదలైన సంగతి తెలిసిందే. శ్రీమ‌తి ప్ర‌వీణ క‌డియాల స‌మ‌ర్ప‌ణ‌లో స్ప్రింట్‌ ఫిలిమ్స్‌, జ్ఞాపిక ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎస్‌జీ మూవీ మేక‌ర్స్ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మించగా చైతన్‌ భరద్వాజ్‌ సంగీతం అందించారు. సినిమాలో లవ్ అండ్ ఎమోషనల్ ఎలిమెంట్స్ చాల బాగున్నాయని.. కార్తికేయ అద్భుతంగా నటించారని ప్రేక్షకులు చెబుతున్నారని చిత్రబృందం చెబుతుంది.

ఆయితే ఇప్పటికే కార్తికేయ అర్జున్‌ జంధ్యాలతో మరో చిత్రం చేయబోతున్నానని ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘గుణ 369’ సినిమా తన జీవితంలో మర్చిపోలేనని, ఇలాంటి ఎమోషనల్ సినిమాను తనకు ఇచ్చిన అర్జున్‌ జంధ్యాలకి ఎప్పటికీ రుణపడి ఉంటానని అంటున్నాడు కార్తికేయ. మొత్తానికి అర్జున్ జంధ్యాలతో చేయబోయే ప్రాజెక్టు కూడా పక్కా యాక్షన్ ఎంటర్ టైనరేనట. ఈ ఏడాది డిసెంబర్ నుండి ఈ సినిమా ప్రారంభం కాబోతోంది.

సంబంధిత సమాచారం :