డైరెక్ట్ గా ఊర్వశి ఓటిటి లోకి విడుదలైన కాశీ వస్ లవ్

డైరెక్ట్ గా ఊర్వశి ఓటిటి లోకి విడుదలైన కాశీ వస్ లవ్

Published on Aug 16, 2021 10:00 AM IST

Kashi vas love
చిన్న, సంధ్య దయన్, ముఖ్య పాత్రల్లో కొప్పుల అశ్విని కుమార్రాజ్ దర్శకత్వంలో నంది కె రెడ్డి నిర్మించిన చిత్రం కాశీ వస్ లవ్. రొమాంటిక్ లవ్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్ట్ 15 వ తేదీన ఊర్వశి ఓటిటి లో విడుదలైంది.

ఈ సందర్బంగా చిత్ర నిర్మాత నంది కె రెడ్డి మాట్లాడుతూ, లవ్ అండ్ ఎంటర్ టైనర్ గా ఓ భిన్నమైన ప్రేమకథగా ఈ చిత్రాన్ని తెరకెక్కించామని అన్నారు. క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కించనట్లు తెలిపారు. ప్రేక్షకులకు సరికొత్త ఫీల్ ఇచ్చేలా తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఊర్వశి ఓటిటి లో ఆగస్టు 15న విడుదల చేస్తున్నామని అన్నారు.

దర్శకుడు అశ్విని కుమార్రాజ్ మాట్లాడుతూ, ఇప్పటివరకు ఎన్నో ప్రేమకథలు చూసాం, కానీ సరికొత్త తరహా ప్రేమ కథగా తెరకెక్కించామని అన్నారు. హీరో, హీరోయిన్స్ తో పాటు ఈ టీం అంతా కొత్తవారే అని అన్నారు. భిన్నమైన కథతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రతి ప్రేమికుడికి నచ్చుతుందని అన్నారు. ఈ చిత్రాన్ని ఊర్వశి ఓటిటి లో విడుదల చేయడం హ్యాపీగా ఉందని అన్నారు. ఈ చిత్రానికి సంగీతం కృష్ణ అందించారు. మహేంద్ర నాథ్ ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు