శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ‘కాటమరాయుడు’!
Published on Nov 20, 2016 6:39 pm IST

katamarayudu
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన అభిమానులకు వరుసగా సినిమాల పండగను కలిపించేందుకు మూడు సినిమాలను మొదలుపెట్టిన విషయం తెలిసిందే. ఇందులో మొదటిదైన ‘కాటమరాయుడు’ ఇప్పటికే సెట్స్‌పైకి వెళ్ళి శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. పవన్ సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమా ప్రస్తుతం హైద్రాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణలో ఉంది. పవన్, శృతి హాసన్ తదితరులు ఈ షెడ్యూల్‌లో పాల్గొంటున్నారు.

ఇక ఇప్పటికే నానక్‌రామ్‌గూడలో ఈ సినిమా కోసమే ప్రత్యేకంగా వేసిన సెట్లో ఒక భారీ షెడ్యూల్‌ను పూర్తి చేసిన టీమ్, ఔట్‌పుట్‌పై చాలా హ్యాపీగా ఉందట. నార్త్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై శరత్ మరార్ నిర్మిస్తోన్న ఈ సినిమాకు డాలీ దర్శకత్వం వహిస్తున్నారు. తమిళంలో ఘన విజయం సాధించిన వీరమ్‌కు రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కుతుందన్న ప్రచారం జరుగుతోంది. మార్చి నెలాఖర్లో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

 
Like us on Facebook