సెంటిమెంట్ సన్నివేశాల చిత్రీకరణలో కాటమరాయుడు !

katamarayudu
పవన్ కళ్యాణ్ నటిస్తున్న యాక్షన్ ఎంటర్ టైనర్ కాటమరాయుడు చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ చిత్రం ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుపుకుంటోంది.పవన్ కళ్యాణ్ అతని తమ్ముళ్ల పాత్రలో నటిస్తున్న వారిపై కొన్ని సెంటిమెంటల్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

ఫిబ్రవరి కల్లా ఈ చిత్ర షూటింగ్ ని పూర్తి చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.ఉగాదికి చిత్రాన్ని విడుదల చేయాలని భావిస్తున్నారు.ఈ చిత్ర టీజర్ జనవరి 26 విడుదల చేయాలని మొదట భావించినా ఆ తరువాత వాయిదా పడింది. డాలి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శరత్ మరార్ నిర్మిస్తున్నారు. పవన్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది.