పవన్ కొత్త సినిమా సెట్స్ పైకి వెళ్ళేది ఎప్పుడంటే !

pawan
‘సర్దార్ గబ్బర్ సింగ్’ ఫ్లాప్ తరువాత పవన్ కళ్యాణ్ సైన్ చిత్రం ‘కాటమరాయుడు’. ‘గోపాల గోపాల’ ఫేమ్ డాలి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం చాలా రోజుల క్రితమే పూజా కార్యక్రమాలు జరుపుకున్నప్పటికీ ఇంకా రెగ్యులర్ షూటింగ్ మాత్రం వెళ్ళలేదు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ నెల 24 నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుందని, పవన్ కళ్యాణ్ కూడా ఆరోజు నుండే షూటింగ్ లో పాల్గొంటాడని తెలుస్తోంది.

గత కొద్దిరోజులుగా పవన్ రాజకీయపరమైన పనుల్లో బిజీగా ఉండటం వలన ఈ చిత్ర షూటింగ్ మొదలుకాలేదు. ఇకపోతే ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో నడిచే ప్రేమ కథగా ఉందనున్న ఈ చిత్రాన్ని ‘నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై శరత్ మరార్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో పవన్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటించనుంది.