Subscribe to our Youtube Channel
 
Like us on Facebook
 
కవచం విడుదల తేదీ లో మార్పు లేదు !
Published on Nov 28, 2018 12:31 pm IST

యువ హీరో బెల్లం కొండ సాయి శ్రీనివాస్ నటిస్తున్నతాజా చిత్రం ‘కవచం’ విడుదల వాయిదా పడనుందని ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ వార్తల్లో నిజం లేదని తెలుస్తుంది. ఇక ఈచిత్రం మొదటగా అనుకున్నట్లుగా డిసెంబర్ 7న విడుదల కు రెడీ అవుతుంది.

నూతన దర్శకుడు శ్రీనివాస్ మామిళ్ల తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో కాజల్ , మెహ్రీన్ హీరోయిన్లుగా నటిస్తుండగా బాలీవుడ్ నటుడు నిల్ నితిన్ ముఖేష్, హర్ష వర్ధన్ రాణే ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. వంశధార క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఇటీవల విడుదలైన ఈ చిత్రం యొక్క టీజర్ ప్రామిసింగ్ గా ఉండంటంతో చిత్రం ఫై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. థ్రిల్లర్ నేపథ్యంలో రానున్న ఈచిత్రం ఫై సాయి శ్రీనివాస్ భారీ ఆశలే పెట్టుకున్నాడు.

సంబంధిత సమాచారం :