కేరళలో నివిన్ పౌలీ సినిమా కొత్త రికార్డు !

కేరళలో నివిన్ పౌలీ సినిమా కొత్త రికార్డు !

Published on Oct 10, 2018 4:00 AM IST

Navin

ప్రేమమ్ ఫేమ్ నివిన్ పౌలీ నటించిన తాజా చిత్రం ‘కాయంకుల కోచున్ని’. అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈహిస్టారికల్ మూవీ కేరళలో కొత్త రికార్డు సృష్టించింది. ఈచిత్రం ఈ గురువారం కేరళలో విడుదలతుంది. ఎన్నడూ లేని విధంగా ఈ సినిమా 24గంటల ప్రదర్శనకు అక్కడి ప్రభుత్వం అనుమతించింది. దాంతో ఈచిత్రం ఇండియాలో 24గంటలు ప్రదర్శించబడుతున్న చిత్రం గా రికార్డు క్రియేట్ చేయనుంది.

ఇక ఈ చిత్రం కేరళ సినీ చరిత్రలోనే అక్కడ అత్యధిక థియేటర్లలో విడుదలవుతుంది. సుమారు 300ల స్క్రీన్ లలో ఈ చిత్రం విడుదలవుతుండగా మొదటి రోజు 1000 షోలకు పైగా ప్రదర్శించాలని అనుకుంటున్నారట. రోషన్ ఆండ్రుస్ తెరకెక్కించిన ఈచిత్రంలో ప్రియా ఆనంద్ కథానాయికగా నటించగా సూపర్ స్టార్ మోహన్ లాల్ ఒక ముఖ్య పాత్రలో కనిపించనున్నారు.

తాజా వార్తలు