మలయాళ యువ హీరో నివిన్ పౌలీ నటించిన తాజా చిత్రం ‘కాయంకుల కోచున్ని’ గత గురువారం విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ రివ్యూస్ తో విజయం దిశగా దూసుకుపోతుంది. అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈహిస్టారికల్ మూవీ కేరళలో కలెక్షన్ల పరంగా కొత్త రికార్డు సృష్టించింది. ఈచిత్రం మొదటి రోజు కేరళ వ్యాప్తంగా రూ. 5.3కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. ఇప్పటివరకు అక్కడ ఇవే బెస్ట్ ఓపెనింగ్స్ కావడం విశేషం. ఇక రెండు రోజులకుగాను ఈచిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 16.50 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది.
ఈ చిత్రం కేరళ సినీ చరిత్రలోనే అక్కడ అత్యధిక థియేటర్లలో విడుదలయ్యింది. సుమారు 300ల కు పైగా థియేటర్లలో ఈచిత్రం ప్రదర్షింపబడుతుంది. ప్రియా ఆనంద్ కథానాయికగా నటించిన ఈచిత్రంలో సూపర్ స్టార్ మోహన్ లాల్ ఒక ముఖ్య పాత్రను పోషించారు.


