చైతన్య సినిమాకు రికార్డింగ్స్ మొదలుపెట్టిన కీరవాణి !
Published on Oct 17, 2017 1:56 pm IST

ఇటీవలే వివాహం చేసుకున్న యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య త్వరలోనే కొత్త చిత్రం ‘సవ్యసాచి’ ని మొదలుపెట్టనున్నారు. చైతూతో కలిసి ‘ప్రేమమ్’ లాంటి బ్లాక్ బస్టర్ ను అందించిన దర్శకుడు చందూ మొండేటి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తుండటంతో ఈ ప్రాజెక్టుపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. దీనికి తోడు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్, ‘బాహుబలి’ ప్రాంచైజీతో జాతీయ స్థాయి గుర్తింపును సొంతం చేసుకున్న కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తుండటం కూడా మరొక హైలెట్ అంశంగా నిలిచింది.

‘బాహుబలి-2’ తర్వాత పూర్తిగా సినిమాలు మానేస్తానన్న కీరవాణిగారు ఆ తర్వాత డెసిషన్ మార్చుకుని తన మనసుకి నచ్చిన సినిమాలకే సంగీతం చేస్తానని ప్రకటించారు. ఆ మాట ప్రకారమే ‘సవ్యసాచి’ కథ నచ్చడంతో సినిమాకు ఒప్పుకుని పని కూడా మొదలుపెట్టేశారు కీరవాణి. రికార్డింగ్స్ కూడా మొదలయ్యాయి. ఫిల్మ్ నగర్ టాక్ ప్రకారం కీరవాణి కంపోజ్ చేయనున్న సంగీతం చాలా బాగుంటుందని, సినిమాకు చాలా బాగా హెల్ప్ అవుతుందని తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటి నిధి అగర్వాల్ ను హీరోయిన్ గా అనుకుంటున్నారని వినికిడి.

 
Like us on Facebook