కీర్తి క్రెడిట్ అందరికి పంచింది…!

Published on Aug 11, 2019 4:05 pm IST

ఇటీవల ప్రకటించిన నేషనల్ అవార్డ్స్ లో అలనాటి నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన “మహానటి” మూవీ ఏకంగా మూడు విభాగాలలో అవార్డులు గెలుచుకొని సత్తా చాటింది. ఈ చిత్రంలో సావిత్రిగా నటించిన కీర్తి సురేష్ ఉత్తమ నటిగా అవార్డు పొందడం జరిగింది.ఈ సందర్భంగా పాత్రికేయుల సమావేశంలో కీర్తి సురేష్ పాల్గొని తన స్పందన తెలియాజేశారు.

ఆమె మాట్లాడుతూ ఈ అవార్డు నటిగా రాణించడానికి మద్దతు ఇచ్చిన నా కుటుంబానికి, గురువుగారైన ప్రియదర్శన్ గారికి, నా ఫ్రెండ్స్, శ్రేయోభిలాషులకు అంకితం ఇస్తున్నారు అన్నారు. అలాగే మహానటి మూవీ గురించి గొప్పగా రాసి, ప్రజల్లోకి వెళ్లేలా చేసిన మీడియా మిత్రులకు ధన్యవాదాలు అని అన్నారు.

ఇక ఈ చిత్ర దర్శకుడు నాగ్ అశ్విన్ కు, నిర్మాతలైన ప్రియాంకా దత్,స్వప్నా దత్ లకు,సంగీత దర్శకుడు మిక్కీ జె మేయర్ కు ఆమె కృతజ్ఞలు తెలిపారు. ఇక ఈ చిత్రంలో కీలక పాత్రలు చేసి చిత్ర విజయంలో భాగమైన రాజేంద్ర ప్రసాద్, దుల్కర్ సల్మాన్,షాలిని పాండే వంటి నటులను పత్రికా సంక్షంగా కీర్తి కొనియాడారు.

సంబంధిత సమాచారం :