క్రేజీ ప్రాజెక్ట్ లో కీర్తి సురేష్ !

Published on Apr 2, 2019 3:25 pm IST

మలయాళ బ్యూటీ కీర్తి సురేష్ వరుస సినిమాలకు కమిట్ అవుతూ ఫుల్ బిజీ గా వుంది. అందులో భాగంగా ప్రస్తుతం తెలుగులో నరేంద్ర దర్శకత్వంలో లేడీ ఓరియెంటెడ్ చిత్రంలో నటిస్తుంది. ఈ చిత్రం తోపాటు ఇటీవల హిందీ సినిమా కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కీర్తి.

ఇక ఇప్పుడు ఆమె మరో క్రేజీ ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని వార్తలు వస్తున్నాయి. ప్రముఖ తమిళ దర్శకుడు మణిరత్నం ‘పొన్నియిన్ సెల్వన్’ అనే చిత్రాన్ని తెరకెక్కించనున్నాడు. ఈ చిత్రంలో యువరాణి పాత్ర కుందవాయ్ పాత్రలో కీర్తి కనిపించనుందట.

ఆమెతో పాటు ఈ చిత్రంలో కార్తీ , జయం రవి , మోహన్ బాబు , అమితాబ్ బచ్చన్ , ఐశ్వర్య రాయ్ ముఖ్య పాత్రల్లో నటించనున్నారట. లైకా ప్రొడక్షన్స్ తో కలిసి మణిరత్నం సొంత నిర్మాణ సంస్థ మద్రాస్ టాకీస్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది.

సంబంధిత సమాచారం :