అజిత్ సరసన నటించనున్న కీర్తి సురేష్?
Published on Nov 27, 2017 5:30 pm IST

శివ దర్శకత్వంలో అజిత్ మరోసినిమా చెయ్యబోతున్నాడు. వీరం, వేదాలం, వివేగం సినిమాల తరువాత విశ్వాసం సినిమాతో మరోసారి వీరు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. సత్య జ్యోతి ఫిలిమ్స్ బ్యానర్ పై తెరకేక్కే ఈ సినిమా జనవరిలో ప్రారంభం అయ్యి దీపావళికి విడుదల కానుంది.

ఈ సినిమాలో అజిత్ ద్విపాత్రాభినయం చెయ్యబోతునట్లు సమాచారం. అనుష్క ను ఫస్ట్ హీరోయిన్ గా సెలెక్ట్ చేసుకున్న చిత్ర యూనిట్ సెకండ్ హీరోయిన్ గా కీర్తి సురేష్ ను ఎంపిక చేసినట్లు కోలోవుడ్ లో వార్తలు వస్తున్నాయి. అజిత్ తో సినిమా చెయ్యాలని ఎప్పటినుండో ఉందని కీర్తి సురేష్ చాలా సందర్భాల్లో చెప్పింది. ఈ సినిమాతో కీర్తి కోరిక తీరిందన్నమాట.

 
Like us on Facebook