మహేష్ బాబుకు జోడీగా ఆమెనే అనుకుంటున్నారట

Published on Mar 29, 2020 6:51 pm IST

సూపర్ స్టార్ మహేష్ బాబు తర్వాతి ప్రాజెక్ట్ ఏమిటనేది ఇంతవరకు ఫైనల్ కాలేదు. ఎక్కువగా పరశురాం సినిమానే ఉండవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే మహేష నుండి అఫీషియల్ క్కన్ఫర్మేషన్ అందాల్సి ఉంది. ఈలోపే ప్రాజెక్ట్ గురించి రకరకాల వార్తలు పుట్టుకొస్తున్నాయి. తాజాగా మహేష్ బాబుకు జోడీగా కీర్తి సురేష్ ఖాయం అయినట్టు ఫిల్మ్ నగర్ టాక్.

ఇంతవరకు మహేష పక్కన నటించని హీరోయిన్ అయితే బాగుంటుందని భావించిన దర్శక నిర్మాతలు కీర్తిని చూజ్ చేసుకుని, ఆమెతో సంప్రదింపులు జరిపారని, కీర్తి సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు చెబుతున్నారు. మరి ఈ వార్తల్లో నిజం ఎంతనేది అధికారిక ప్రకటన వెలువడ్డాకే తెలుస్తుంది. ఇకపోతే కీర్తి ప్రస్తుతం తెలుగులో ‘మిస్ ఇండియా, రంగ్ దే’ సినిమాల్లో నటిస్తోంది. ఈ రెండూ కూడా షూటింగ్ దశలో ఉన్నాయి.

సంబంధిత సమాచారం :

X
More