మన్మథుడు 2 లో మరో హీరోయిన్ !

మన్మథుడు 2 లో మరో హీరోయిన్ !

Published on May 6, 2019 11:00 PM IST

నాగార్జున , ‘చి ల సౌ’ ఫేమ్ రాహుల్ రవీంద్రన్ కాంబినేషన్ లో సూపర్ హిట్ మూవీ మన్మథుడు కి సీక్వెల్ గా రూపొందతున్న చిత్రం మన్మథుడు 2. ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా నటిస్తుండగా సమంత , కన్నడ బ్యూటీ అక్షరా గౌడ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం యొక్క షూటింగ్ గత కొన్ని వారాల నుండి పోర్చుగల్ లో జరుగుతుంది. ఈ షెడ్యూల్ తో సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి కానుంది. ఇక ఈ చిత్రంలో మరో హీరోయిన్ ను తీసుకోవాలనుకుంటున్నారు.

ఓ కీలక మైన పాత్ర కోసం రైజింగ్ హీరోయిన్ కీర్తి సురేష్ ను సంప్రదించారట. అయితే కీర్తి డేట్స్ ఖాళీ లేకపోవడంతో ఇంకా తన నిర్ణయాన్ని వెల్లడించలేదని సమాచారం. ఆర్ఎక్స్ 100 ఫేమ్ చైతన్ భరద్వాజ్ సంగీతంఅందిస్తున్న ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మిస్తుంది. దసరా కానుకగా ఈచిత్రం విడుదలకానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు