భారీ ఓపెనింగ్ ను రాబట్టుకున్న బాలీవుడ్ మూవీ !

Published on Mar 22, 2019 3:42 pm IST

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటించిన తాజా చిత్రం ‘కేసరి’ నిన్న విడుదలై పాజిటివ్ రివ్యూస్ ను రాబట్టుకుంది. దాంతో ఈ చిత్రం మొదటి రోజు దేశ వ్యాప్తంగా 21 కోట్ల వసూళ్లను రాబట్టుకుంది. ఈ ఏడాది బాలీవుడ్ లో ఇదే హైయెస్ట్ ఓపెనింగ్. నిన్నహోలీ సందర్భంగా సెలువు దినం కావడం కూడా ఈ చిత్రానికి కలిసి వచ్చింది.

1897 లో జరిగిన సారాగడి యుద్ధం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో అక్షయ్ కి జోడిగా పరిణితి చోప్రా నటించింది. యుద్ధ సన్నివేశాలు ఈ చిత్రాన్ని హైలైట్ గా నిలిచాయి. అనురాగ్ సింగ్ తెరక్కించిన ఈ చిత్రాన్ని ధర్మ ప్రొడక్షన్స్ నిర్మించింది. తనిష్క్ బాగ్చి సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం :