మొదటి వారం విజయవంతంగా నడిచిన ‘కేశవ’ !
Published on May 28, 2017 6:41 pm IST


హీరో నిఖిల్ సిద్దార్థ చేసిన తాజా చిత్రం ‘కేశవ’ పాజిటివ్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. మొదటి రోజే రూ. 4. 6 కోట్ల గ్రాస్ రాబట్టిన ఈ సినిమా రెండవ రోజైన శనివారం రూ. 3.7 కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం మొదటి వారం మొత్తం ఇలాగే మంచి వసూళ్లతోనే నడిచింది. సినిమా పై ఉన్న అంచనాలు, నిఖిల్ నటన సినిమాకు బాగా ప్లస్ అయి ప్రేక్షకుల్లో పాజిటివ్ టాక్ ఏర్పడేలా చేశాయి.

దేంతో మొదటి వరం గడిచే సమయానికి ప్రపంచవ్యాప్తంగా రూ. 7.6 కోట్ల షేర్ వసూలు చేసిన ఈ చిత్రం రూ. 16 కోట్ల గ్రాస్ ను నమోదు చేసింది. చిత్ర పిఆర్ విభాగం లెక్కల ప్రకారం ప్రాంతాల వారీగా చూసుకుంటే నైజాం ఏరియాలో రూ. 2. 20 కోట్లు, సీడెడ్లో రూ. 74 లక్షలు, నెల్లూరులో రూ. 15 లక్షలు, గుంటూరులో రూ. 41 లక్షలు, కృష్ణాలో రూ. 51 లక్షలు, వెస్ట్ గోదావారిలో రూ. 37 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 53 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 96 లక్షలు, కర్ణాటన రూ. 42 లక్షలు, ఓవర్సీస్లో రూ. 88 లక్షలు గా ఉన్నాయి.

 
Like us on Facebook