
తేజస్, చాందిని చౌదరిలు హీరో హీరోయిన్లుగా రూపొందిన ‘కేటుగాడు’ సినిమాతో తెలుగు పరిశ్రమకు దర్శకుడు కిట్టు నల్లూరి. తన మొదటి సినిమాతో దర్శకుడిగా ఫర్వాలేదనిపించుకునే మార్కులు వేయించుకున్న కిట్టు, తాజాగా తన రెండో సినిమా కోసం సిద్ధమవుతున్నారు. విజయ లక్ష్మి ఆర్ట్స్ బ్యానర్‌పై బద్రి వర్మ ఈ సినిమాను నిర్మించనున్నారు. ఇక మొదటి సినిమాతో దర్శకుడిగా మంచి అవగాహన వచ్చిందని, రెండో సినిమాతో మరింత బాగా అలరిస్తానని దర్శకుడు చెప్పుకొచ్చారు.
ఇక ఈ సందర్భంగా కిట్టు నల్లూరి మాట్లాడుతూ.. రెండో సినిమాను లక్ష్మి ఆర్ట్స్ బ్యానర్‌పై చేయడం ఆనందంగా ఉందని, ఈ సినిమాలో ఓ ప్రముఖ హీరో నటించనున్నారని తెలిపారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన ఇతర వివరాలను త్వరలోనే తెలియజేస్తామని, తన మొదటి సినిమాలానే అన్ని కమర్షియల్ అంశాలతో నిండిన ఓ మంచి కథతో ఈ సినిమా ఉండనుందని కిట్టు నల్లూరి తెలిపారు.

